క్రైస్తవ పరిచర్య

186/278

సమర్థన

క్రీస్తు అనుచరులు ఆయన పనిచేసినట్లు పని చెయ్యాలి. మనం ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టాలి, బట్టల్లేనివారికి బట్టలివ్వాలి, బాధలు శ్రమలు అనుభవిస్తున్న వారిని ఓదార్చాలి. నిస్పృహ చెందిన వారిని ధైర్యపర్చాలి, ఆశలు వదులుకున్నవారిలో నిరీక్షణ రగిలించాలి. అలా చేస్తే మనకు కూడా “నీ నీతి నీ ముందర నడుచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును’ అన్న వాగ్దానం నెరవేరుతుంది. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పులు. 350. ChSTel 218.1

క్రైస్తవ సహాయక సేవల్లో నిమగ్నమైన వారు ప్రభువు ఏ సేవ చెయ్యాలని కోరుతున్నాడో దాన్ని చేస్తున్నారు. ఆయన వారి సేవను అంగీకరిస్తాడు. ఈ దిశలో జరిగే పని పట్ల సెవెంతుడే ఎడ్వెంటిస్టులు సానుభూతి చూపించి దాన్ని చిత్తశుద్ధితో చేపట్టాలి. తమ సొంత సేవా పరిధిలో ఉన్న ఈ పనిని అలక్ష్యం చెయ్యటంలో, తమ భారాల్ని భరించటానికి నిరాకరించటంలో సంఘం చాలా నష్టపోతుంది. ఈ పనిని సంఘం చేపట్టాల్సిన విధంగా చేపట్టి ఉంటే, అనేక ఆత్మలు రక్షణ పొందటానికి వారు సాధనమయ్యే వారు. టెస్టిమొనీస్, సం.6, పు. 295. ChSTel 218.2

ఆయన వరాలన్నీ మానవాళికి మేలు చెయ్యటానికి, బాధలోను లేమిలోను ఉన్న వారిని ఆదుకోటానికి వినియోగమవ్వాలి. మనం ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టాలి, వస్త్రహీనులుకి వస్త్రాలివ్వాలి, విధవరాండ్రకి తండ్రిలేని పిల్లలికి సహాయం చెయ్యాలి, దుఃఖపడుతున్న వారికి దళితులుకి పరిచర్య చెయ్యాలి. లోకంలో ఉన్న విస్తారమైన దుఃఖం దేవుడు సంకల్పించింది కాదు. ఒక వ్యక్తికి జీవితంలో విలాస వస్తువుల సమృద్ధి ఉండాలని ఇతరులు ఆహారానికి అలమటించాలని ఆయన సంకల్పించలేదు. జీవితావసరాలు తీరిన తర్వాత మిగిలిన ద్రవ్యం మానవాళి శ్రేయానికి ఉపయోగించటానికి దీన్ని మానవుడికి దేవుడు అప్పగించాడు. ప్రభువంటున్నాడు, “మీకున్నది అమ్మి ధర్మ చెయ్యండి.” “పంచటానికి సిద్దంగా ప్రసరించటానికి సమ్మతంగా” ఉండండి. “నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డి వారిని పిలువుము.” “దుర్మార్గులు కట్టిన కట్లను విప్పండి. “కాడి మాను మోకులు” తియ్యండి. “బాధింపబడిన వారిని విడిపించండి. “ప్రతి కాడిని విరగ” గొట్టండి. మా “ఆహారమును ఆకలిగొనిన వానికి” పెట్టండి. “దిక్కుమాలిన బీదలను... యింట చేర్చుకోండి. “వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము” ఇవ్వు. “శ్రమ పడి నవానిని తృప్తి” పర్చండి. “మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి.” ఇవి ప్రభువు ఆజ్ఞలు. క్రైస్తవులుగా చెప్పుకునే గొప్ప జనం ఈ పని చేస్తున్నారా? క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 370, 371. ChSTel 218.3

మనం సత్ర్కియలనే ఫలం ఫలించాలని క్రీస్తు కోరుతున్నాడు. మనం దయగా మాట్లాడాలి, దయగల పనులు చెయ్యాలి, పేదలు లేమిలో ఉన్నవారు, బాధలనుభవిస్తున్న వారి పట్ల కరుణ కలిగి వ్యవహరించాలి. నిరాశతో దుఃఖంతో బరువెక్కిన హృదయాలకు హృదయాలు సానుభూతి చూపినప్పుడు, వస్త్రహీనుడు వస్త్రాలు పొందినప్పుడు, పరదేశి మీ ఇంటిలోను మా హృదయంలోను స్థానం పొందినప్పుడు, దూతలు మీకు సమీపంగా వస్తారు. దానికి స్పందనగా పరలోకం నుంచి గానం వినిపిస్తుంది. న్యాయం, దయ, ఉదారతతో నిండిన కార్యాలు మధుర గానమై పరలోకంలో వినిపిస్తాయి. తన సింహాసనం మంచి తండ్రి ఈ దయా కార్యాలు చేసే వారిని చూసి వారిని తన ప్రశస్త ఐశ్వర్యంగా పరిగణిస్తాడు. “నేను నియమింప బోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమైయుందురు” అంటున్నాడు ప్రభువు. లేమి కలిగి ఉన్న వారికి బాధపడుతున్న వారికి చేసే ప్రతీ దయా కార్యం యేసుకు చేసినట్లే పరిగణీన పొందుతుంది. బీదలకు సహాయం చేసినప్పుడు, బాధలు హింస అనుభవిస్తున్న వారికి సానుభూతి కనపర్చినప్పుడు, దిక్కులేని వారిని అనాధలను చేరదీసినప్పుడు, మీరు యేసుతో దగ్గర సంబంధం ఏర్పర్చుకుంటున్నారు. టెస్టిమొనీస్, సం.2, పు. 25. ChSTel 219.1

లేమిలో ఉన్న వారిని హింసించబడుతున్న వారిని, బాధలో ఉన్న వారిని, దిక్కులేని వారిని చేర్చుకుని ఆదరించే సేవ ఈ కాలానికి దేవుని సత్యాన్ని నమ్ముతున్నామని చెప్పే ప్రతీ సంఘం చాలా కాలం నుంచి చేస్తుండాల్సిన సేవ. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టటం, తమ గృహాల నుంచి విసర్జించబడిన వారిని ఆదరించటం, తమకు తాము సహాయం చేసుకోలేని దుస్థితిలో ఉన్న వారికి సహాయం చెయ్యటంవంటి సత్కార్యాలకు శక్తిని కృపను అనుదినం దేవుని వద్ద నుంచి కూర్చుకోటం ద్వారా మనం సమరయుడి దయకనికరాల్ని కనపర్చాలి. సిలువను పొందిన వాడిగా క్రీస్తుని సమర్పించటానికి మనకు ఈ సేవలో మంచి అవకాశం లభిస్తుంది. టెస్టిమొనీస్, సం.6, పు. 276. ChSTel 219.2

తమ ప్రార్ధనలు అంత నిర్జీవంగా, తమ విశ్వాసం అంత చంచలంగా, తమ క్రైస్తవానుభవం అంత చీకటిగా సందిగ్ధంగా ఉండటానికి కారణమేంటా అని అనేకులు తర్జన భర్జన పడుతుంటారు. మనం ఉపవాస ముండటం లేదా “యెహోవా సన్నిధిని మనము దుఃఖకాంతులమై తిరుగుట” లేదా అని వారు ప్రశించుకుంటారు. ఈ పరిస్థితిని ఎలా మార్చుకోగలమో యెషయా ఏభై ఎనిమిదో అధ్యాంయలో క్రీస్తు సూచిస్తున్నాడు.... 6,7 వచనాలు. బలహీనమైన, సందేహిస్తున్న, వణుకుతున్న ఆత్మకు క్రీస్తు సూచించే మందు ఇదే. ప్రభువు ముందు దుఃఖాక్రాంతులై తిరిగేవారు లేచి, ఎవరికి చెయ్యూత అవసరమో వారికి సహాయం చెయ్యాలి. టెస్టిమొనీస్, సం.6, 266. ChSTel 220.1

పడిపోయిన వారిని పైకి లేపటంలో, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చటంలో పరలోక మహిమ ఉన్నది. క్రీస్తు ఎక్కడ మానవ హృదయాల్లో నివసిస్తాడో అక్కడ ఆయన అదేరీతిగా వెల్లడవుతాడు. ఎక్కడ క్రీస్తు మతం క్రియాత్మకమౌతుందో అక్కడ అది మేలు చేస్తుంది. అది ఎక్కడ పని చేస్తుందో అక్కడ వెలుగు ఉంటుంది. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 386. ChSTel 220.2

సాపతు విధవరాలు తన చివరి ఆహారం ఏలీయాతో పంచుకుంది. ఫలితంగా ఆమె ప్రాణం ఆమె కుమారుడి ప్రాణం నిలిచాయి. శ్రమలు లేమి కాలంలో తమకన్నా ఎక్కువ అవసరమున్న వారికి ఎవరు సానుభూతి చూపి సహాయమందిస్తారో వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మార్పులేనివాడు. ఏలీయా కాలంలో ఆయనకున్న శక్తి మన దినాల్లో ఏమి తగ్గలేదు. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పులు. 131, 132. ChSTel 220.3

స్వార్థరహిత పరిచర్యలో ప్రదర్శితమయ్యే క్రీస్తు ప్రేమ ఖడ్గంకన్నా, న్యాయ స్థానం కన్నా ఎక్కువ శక్తిమంతంగా దుష్టుణ్ని సంస్కరిస్తుంది. ఇవి నేరస్తుడికి భయం పుట్టించటానికి అవసరం. అయితే ప్రేమ గల మిషనెరీ ఇంతకన్నా ఎక్కువ చెయ్యగలడు. తరచు మందలింపు వల్ల కఠినమయ్యే హృదయం క్రీస్తు ప్రేమ వల్ల కరుగుతుంది. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 106. ChSTel 220.4