క్రైస్తవ పరిచర్య

175/278

యధార్థ నాయకత్వ ప్రదర్శన

ఇప్పుడు పని ప్రారంభమయ్యింది గనుక నెహెమ్యా ఉత్సాహం, శక్తి ఆగిపోలేదు. పనికి దిశానిర్దేశం చేస్తూ, ప్రతీ ప్రతిబంధకాన్ని గుర్తిస్తూ, ప్రతీ అత్యవసర పరిస్థితికి ఏర్పాట్లు చేస్తూ నిత్యం అప్రమత్తంగా ఉండి పనిని పర్యవేక్షించాడు. మూడుమైళ్ల నిడివిగల ఆ గోడ పొడవునా అతడి ప్రభావం నిత్యం కనిపించింది. సమయోచితమైన మాటతో భయస్తుల్ని ధైర్యసర్చాడు, కష్టించి పనిచేస్తున్న వారిని అభినందించాడు, సోమరులని మేల్కొలిపాడు. తమ శత్రువులు కొన్నిసార్లు కొంతదూరంలో పోగుపడి, తీవ్ర సంభాషణలో నిమగ్నమైనట్లు, ఏదో అల్లరికి పన్నాగాలు పన్నుతున్నట్లు నటించి, ఆ మీదట పనివారి దగ్గరకు వచ్చి, వారి గమనాన్ని మళ్లించి, వారి పనికి ఆటంకం కలిగించటానికి ప్రయత్నించటం పై నెహెమ్యా డేగకళ్లతో నిఘావేశాడు. ChSTel 205.2

ప్రతీ పనివాడి కన్ను తరచు నెహెమ్యాపై కేంద్రీకృతమై ఉండి చిన్న సూచనను అనుసరించటానికి సన్నద్ధంగా ఉండగా, ఆ నిర్మాణ భారాన్ని ఎవరు తన హృదయంలో పెట్టారో, ఆ పని అంతటికీ పర్యవేక్షకుడెవరో ఆ దేవుని పై అతడి కన్ను కేంద్రీకృతమై ఉంది. తన హృదయంలో విశ్వాసం ధైర్యం బలపడేకొద్దీ “ఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్పములను సఫలము చేయును” అంటూ ఘంటాకంఠంగా చెప్పాడు. అతడి మాటలు పునరుక్తి అయి, ప్రతి ధ్వనించి గోడ పొడవునా ఉన్న పనివారి హృదయాల్సి ఉత్సాహం ఉద్రేకాలతో నింపాయి. సదర్న్ వాచ్ మేన్, ఏప్రి. 5, 1904. ChSTel 205.3

నెహెమ్యా అతడి అనుచరులు కష్టాలు శ్రమల నుంచి వెనకంజ వెయ్యలేదు. లేక కఠిన సేవనుంచి తప్పుకోలేదు. రాత్రిగాని పగలు గాని నిద్రపోతున్న ఆ స్వల్ప సమయంలోగాని వారు తమ పనిబట్టలు మార్చుకోలేదు లేక తమ ఆయుధాలు తీసి పక్కన పెట్టలేదు. “ఈలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడియున్న పారావారు గాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని వస్త్రములు తీసివేయలేదు.” సదర్న్ వాచ్ మేన్, ఏప్రి. 26, 1904. ChSTel 206.1