క్రైస్తవ పరిచర్య

160/278

చీకటిలో వెలుగు

బయలుకి మోకాలు వంచనివారు లోక నివాసుల నడుమ అన్ని దేశాల్లోకి చెదిరి ఉన్నారు. నమ్మకమైన ఈ మనుషులు, భూమిని చీకటి కమ్మినప్పుడు, కటిక చీకటి ప్రజల్ని కప్పినప్పుడు, రాత్రిలో మాత్రమే కనిపించే నక్షత్రాల్లా ప్రకాశిస్తారు. అన్య ఆఫ్రికాలో, ఐరోపాలో, దక్షిణ అమెరికాలో ఉన్న కథోలిక్కు దేశాల్లో చైనాలో, ఇండియాలో, సముద్ర దీవుల్లో లోకంలోని చీకటి మూలల్లో దేవుడు ఏర్పర్చుకున్నవారున్నారు. వారు దైవధర్మశాస్త్ర విధేయతకున్న పరివర్తన శక్తిని భ్రష్ట ప్రపంచానికి స్పష్టంగా కనపర్చుతూ చీకటిలో ప్రకాశిస్తారు. ఇప్పుడు సయితం వారు ప్రతీ దేశంలోను, ప్రతీ భాష మాట్లాడే ప్రజల్లోను ఉన్నారు. తీవ్ర మత భ్రష్టత ప్రబలుతున్న గడియలో “అల్పులు అధికులు, ధనికులు దరిద్రులు, స్వతంత్రులు బానిసలు, అందరూ” అబద్ద విశ్రాంతి దినాచరణకు గుర్తును స్వీకరించటమో లేక మరణ దండనకు గురికావటమో అన్న పరిస్థితిని సాతాను కలిగించినప్పుడు దేవునికి నమ్మకంగా నిలిచేవీరు, “నిరపరాధులు, నిరపాయులు, గద్దింపు పొందని దైవకుమారులు అయిన వీరు” “లోకంలో జ్యోతుల్లా ప్రకాశిస్తారు.” ఎంత చీకటిగా ఉంటే వారు అంత తేజోవంతంగా ప్రకాశిస్తారు. ప్రొఫెట్స్ అండ్ కింగ్స్, పు. 188, 189. ChSTel 193.1

మన మీద హింస తుపానులా విరుచుకుపడినప్పుడు నిజమైన గొర్రెలు నిజమైన కాపరి స్వరం వింటాయి. నశించిన వారిని రక్షించటానికి ఆత్మ త్యాగంతో కూడిన కృషి జరుగుతుంది. మందనుంచి తప్పిపోయి తిరుగుతున్న అనేకులు ఆ మహా కాపరిని వెంబడించటానికి తిరిగి వస్తారు. సైన్స్ ఆఫ్ ది టైమ్స్ (ఆస్ట్రేలియన్) సప్లిమెంట్, జన. 26, 193. ChSTel 194.1

దివ్య పరిరక్షణ ChSTel 194.2

సంఘర్షణ ఎడతెగక సాగేదైనప్పటికీ ఒంటరిగా పోరాడటానికి ఎవరూ విడవబడరు. దేవుని ముందు వినయ హృదయులై నడిచే వారికి దేవదూతలు సహాయం చేసి వారిని నడిపిస్తారు. తనను నమ్ముకున్న వ్యక్తిని ప్రభువు ఎన్నడు విడిచి పెట్టడు. తన బిడ్డలు చెడు నుంచి రక్షణ కోసం తనను హత్తుకున్నప్పుడు ఆయన దయతోను ప్రేమతోను తన ధ్వజం శత్రువుపై ఎత్తుతాడు. వారిని ముట్టవద్దు. వారు నావారు. నేను వారిని నా అరచేతిలో చెక్కుకున్నాను అని ఆయనంటాడు. ప్రొఫెట్స్ అండ్ కింగ్స్, పు. 571. ChSTel 194.3

నీతి నిమిత్తం శ్రమలనుభవించే వారికి పరలోకం చాలా దగ్గరలో ఉంటుంది. నమ్మకమైన తన ప్రజల ఆసక్తులే క్రీస్తు ఆపక్తులవుతాయి. తన భక్తుల రూపంలో ఆయన శ్రమలనుభవిస్తాడు. తాను ఎన్నుకున్న వారిని ఎవరు శ్రమ పెడ్తారో వారు ఆయన్ని శ్రమ పెట్టినవారవుతారు. శారీరక హాని లేక దుస్థితి నుంచి విడిపించటానికి సమీపంగా ఉండే శక్తి మరి పెద్ద దుష్టినుంచి రక్షించటానికీ సమీపంగా ఉంటుంది. అన్ని పరిస్థితుల్లోను దైవసేవకుడు తన విశ్వసనీయతను కాపాడుకునేటట్లు అది చేస్తుంది. ప్రొఫెట్స్ అండ్ కింగ్స్, పు. 545. ChSTel 194.4

సంఘం ఎదుర్కుంటున్న ప్రమాదాల్ని, శ్రతువులు సంఘానికి చేసే హానిని ప్రభువు విస్మరిస్తున్నట్లు కొన్నిసార్లు కనిపించవచ్చు. కాని దేవుడు విస్మరించడు. తన సంఘమంత ప్రియమైంది ప్రశస్తమైంది దేవునికి ఈ లోకంలో ఇంకేదీలేదు. లౌకిక విధానం దాని చరిత్రను భ్రష్టపర్చటం ఆయన చిత్తం కాదు. తన ప్రజల్ని సాతాను శోధనలు జయించటానికి ఆయన వారిని విడిచి పెట్టడు. తనపై తప్పుడు ప్రచారం చేసే వారిని ఆయన శిక్షిస్తాడు. కాని యధార్థంగా పశ్చాత్తాపపడే వారందరిపట్ల ఆయన కనికరం చూపుతాడు. ప్రొఫెట్స్ అండ్ కింగ్స్, పు. 590. ChSTel 194.5