సంఘమునకు ఉపదేశములు

80/329

పాపము ఎవరితో ఒప్పుకొనవలెను?

తమ పాపములను సమర్థించి లేక కప్పిపుచ్చి పరలోక గ్రంథములందలి ఒప్పుకొనబడక క్షమించబడక నిలిచి యుండునట్లు చేయువారు సాతానుచే జయింపబడెదరు. వారు ధరించు నామము, ఆక్రమించు స్థానము, ఉన్నతమగు కొలది వారి మార్గము దేవుని దృష్టికి ఎక్కువ దుఃఖకరముగ నుండి వారిపై తమ విరోధి జయము ధృఢతరమగును. ప్రభువు దినము కొరకు స్దిద్దపడని వారికి, ఆ సిద్ధబాటు శ్రమకాలమందుగాని, తరువాత మరే కాలమందుగాని రాదు. అట్టివారి స్థితి నిరీక్షణ శూన్యమైనది. 6 CChTel 177.1

మీ పాపములను తప్పిదములను గూర్చి యెరుగని వారికి వాని నొప్పుకొన నక్కరలేదు. అవిశ్వాసులకు విజయము కూర్చు పాపపు ఒప్పుకోలు మీరు చెయనక్కరలేదు; కాని అట్టిది సమంజసముగానుండు వారికిని, మీ తప్పిదమును అవకాశముగాగొని మిమ్మును అల్లరి చేయని వారితోను దైవ వాక్యానుసారము మీ పాపములను ఒప్పుకొనుడి. వారు మీ కొరకు ప్రార్థించవలెను. అప్పుడు దేవుడు మీ కార్యమునంగీకరించి మిమ్మును స్వస్థపర్చును. దయచేసి మీ ఆత్మల క్షేమము నిమిత్తము అనంత జీవము కొరకు నమ్మకముగా కృషి చేయుడి. మీ గర్వమును, శుష్క ప్రీతిని దూరముగా పెట్టి తిన్నగా పని చేయుడి. తిరిగి మందయందు ప్రవేశించుడి. మిమ్మును చేర్చుకొనుటకు కాపరి తహ తహలాడుచున్నాడు. పశ్చాత్తాపపడి మొదటి క్రియలను చేసి మరల దైవాదరమును సంపాదించు కొనుడి. 7 CChTel 177.2

క్రీస్తే మీ విమోచనకర్త. మీరు చేయు వినయ పూర్వకమైన ఒప్పుకోలును ఆయన స్వలాభమునకు వినియోగించువాడు కాడు. మీకేదయినా రహస్యపాపమున్నచో మానవునికి దేవునికిని ఏకైక మధ్యవర్తియగు క్రీస్తుతో ఒప్పుకొనుడి. “ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు.” 1 యోహాను 2:6. ఆయనకు చెందు దశను భాగములు, చందాలు ఇయ్యకుండుటద్వారా మీరు దేవుని యెడల పాపము చేసినచో మీ పాపమును దేవునితోను, సంఘముతోను ఒప్పుకొని ఆయన యిచ్చిన ఈ ఆదేశమును అనుసరించుడి. “పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి.” మలాకీ 3:10. 8 CChTel 177.3

దైవ ప్రజలు విజ్ఞతతో మెలగవలెను. తెలిసిన ప్రతి పాపమును ఒప్పుకొనువరకు వారు తృప్తిచెందరాదు. అప్పుడు క్రీస్తు వారిని అంగీకరించెనని నమ్ముట వారి తరుణమును విధియునునైయున్నది. ఇతరులు వారి పాపములను కప్పిపుచ్చి వారి యానందము నిమిత్తము వారిని సంఘములోనికి తెచ్చుట మంచిది కాదు. అట్టి యానందము కూటము ముగియువరకు మాత్రమే యుండును. ఉద్రేకమును బట్టిగాక, నియమమునుబట్టి దేవునికి సేవజేయవలెను. మీ స్వకీయ కుటుంబములలో ఉదయ సాయంతనములయందు మీ యంతట మీరు జయమును సాధించుకొనుడి. మీ అనుదిన కృత్యములు ప్రార్థన నాటంకపర్చనీయకుడి. ప్రార్థనయందెక్కువ సమయము గడుపుడి. ప్రార్థించునపుడు దేవుడు మీ ప్రార్థన నాలకించునని విశ్వసించుడి. ప్రార్థనతతో బాటు విశ్వాసము కలిగి యుండిడి అన్ని వేళలయందును మీకు త్వరిత సమాధానము రాకపోవచ్చును; అట్టి సమయములలోనే మీ విశ్వాసము పరీక్షింపబడును. 9 CChTel 178.1