సంఘమునకు ఉపదేశములు

74/329

పిల్లఉ భక్తి భావము కలిగి యుండవలెను

తల్లి దండ్రులారా! మీ బిడ్డల మనసులలో క్రైస్తవ మతము యొక్క ప్రమాణమును పెంచుడి. క్రీస్తును తమ అనుభవములో కనపర్చునట్లు వారికి సాయపడండి. దేవుని మందిరము పట్ల గొప్ప భక్తి భావము కలిగి యుండునట్లును, దేవాలయములో వారు ఈ దిగువతలంపులతో నిండిన హృదయములు కలిగి ప్రవేశించ వలెనని వారు గ్రహించునట్లును తర్బీతేచేయండి. “ఇక్కడ దేవుడున్నాడు. ఇది ఆయన మందిరము. నేను సదుద్దేశములను, పవిత్ర తలంపులను కలిగి యుండవలెను. నా హృదయములో గర్వము, అసూయ, ఈర్ష్యాళువు, దురాలోచన, ద్వేషము, మోసము ఉండరాదు. ఏలయనగా నేను దైవసన్నిధిలోనికి వచ్చుచున్నాను. దేవుడు తన ప్రజలను కలిసికొని ఆశీర్వదించు స్ధలమది. పరిశుద్ధును, సర్వేన్నతుడును, ఆనంతడును అగు ఆయన నన్ను చూచును. నా హృయమును పరీక్షించును. ఆయన నా రహస్యాలోచనలను క్రియలను గమనించును.” సున్నితములైన సులభముగా లొంగు మనస్సులుగల యువజనులు తమ తల్లిదండ్రులు దైవవిషయములనెట్లు గైకొను చున్నారో దానినిబట్టి దైవసేవకుల కృషిని గ్రహింతురు. bచాలమంది కుటుంబనాయకులు ప్రసంగమును తమ గృహములవద్ద ఆపేక్షణ చేసెదరు. ప్రసంగములోని కొన్ని విషయములను అంగీకరించి కొన్నింటిని మిమర్శితురు. ఇట్లు మానవులకు దేవుడు పంపు సందేశము విమర్శికు, అసంగీకారమునకు, అనాలోచనకు గురియగుచున్నది. నిర్లక్ష్యముతోను, అగౌరముతోను కూడిన ఆపేక్షణలు యౌవనస్లులలో నేయుద్దేశ్యములను కలిగించునో పరలోక గ్రంథములు మాత్రమే వివరింపగలవు. తలిదండ్రులు తలంచుదానికన్న పిల్లలు వీనిని చూచి గ్రహించెదరు. ఎన్నడును పూర్తిగా మార్చ శక్యముగాని దురభిమానము వారి మనసున ముద్రింపబడును. తమ బిడ్డల హృదయ కాఠిన్యమును గూర్చియు, దైవవిధులను నెరవేర్చునట్లు వారి నైతిక మన: ప్రవృతిని మేల్యోల్పుటలో తమకు కలుగుచున్న కష్టమును గూర్చియు తల్లిదండ్రులు దు:ఖించెదరరు. 4 CChTel 166.2

దైవనామముపట్ల భక్తి భావము కనపర్చవలెను అనాలోచితముగా నైనను, చులకనగా నైనను ఆనామము నెన్నడును ఉచ్చరించరాదు. ప్రార్థనయందు సైతము ఆ నామమును తరచుగాను అనవసరముగా ఉచ్చరించుట మానవలెను. “ఆయన నామము పరి శుద్దమైనది. పూజింప దగినది.” (కీర్తనలు 111:9. ) ఆ నామము నుచ్ఛరించునపుడు దేవదూతలు తమ ముఖములు కప్పుకొందురు. పడిపోయిన పాపులమగు మనము ఇంక నెంత యుతముగా ఆనామమునుచ్ఛరించవలెను! CChTel 167.1

దైవవాక్యమును మనము గౌరవింపవెను. అజాగ్రత్తగా కొనుటగాని, సామాన్య పుస్తరమువలె దాని నుపయోగించుటగాని చేయక ఆ పరిశుద్ద గ్రంథమును మనము గౌరవించవలెను. లేఖముల నెన్నడును పరిహాసముగా నెత్తి పలుకరాదు. లేక పలుకరాదు. లేక లేఖన వాక్య భావమును చతురమైన సామెతగా నుపయోగించరాదు. “దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే” అవి మట్టి మూసలో ఏడు మారులు తరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి,” (సామితెలు 30:5, కీర్తన 12:6. ) CChTel 167.2

ముఖ్యముగా విధేయతద్వారా యథార్థమయిన భక్తి భావము చూపవలెనని పిల్లలు నేర్చుకొనవలెను. అప్రాముఖ్యమైన దేవుడాజ్ఞాపించలేదు. ఆయనకు ముచ్చట గొలుపు మర్యాదను చూపుటకు ఒకే మార్గమున్నది. ఆయన చెప్పినది చేయుటయే ఆ మార్గము. CChTel 167.3

ఆయనకు ప్రతిగా వ్యవహరించుటకు పిలువబడిన బోధకులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను పిల్లలు సన్మానింపవలెను. వీరిని సన్మానించుటయే దేవుని గౌరవించుటగా పరిగణించబడును. 5 CChTel 168.1

దేవుని ప్రత్యేక సన్నిధి వలన ప్రత్యేకించబడిన స్థలము ఎట్లు పరిగణించబడవలెనో తెలుపు లేఖన వాక్యములను పెద్దలేమి పిన్నలేమి ధ్యానించుట శ్రేయస్కరము. “నాపాదముల నుండి చెప్పులు విడువుము. నీవు నిలచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము.” అని మండుచున్న పొదయెద్ద మోషే హెచ్చరించబడెను. (నిర్గమ 3:5) దేవదూతల దర్శనము చూచిన పిమ్మట యాకోబిట్లు వచించెను. “నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియక పోయెను.. .. . ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ఇది పరలోకపు గవిని.” (ఆది 28:16, 17. )6 CChTel 168.2

పరిశుద్ద సంగతలును గూర్చి భక్తియుతముగా మాట్లాడుచు ఉపదేశము ద్వారాను క్రియల ద్వారాను మీ విశ్వాసమును గౌరవించు చున్నట్లు చూపించుడి. వేద వాక్యములు నెత్తి పలుకుచున్నపుడు అలక్ష్యపు వచనములు మీనోటి నుండి రానీయండి. మీ చేతులతో బైబిల్ గ్రంథమును పట్టుకొనునపుడు మీరు పరిశుద్ధ స్థలమున నున్నారని జ్ఞాపకముంచు కొనుడి. మీ చుట్టును దేవదూతలున్నారని మీ కన్నులు తెరవబడగలిగినచో మీరు వారిని చూచెదరు. మీరెవరిని సంధింతురో వారు మిమ్మును పరిశుద్ద వాతావరణము ఆవరించినదని మీ ప్రవర్తనద్వారా గ్రహించవలెను. ఒక వ్యర్థపు మాట, అనర్థపు నవ్వు, ఒక ఆత్మను తప్పుదారిని నడిపించ వీలుంది. దేవునితో నిత్య సంబంధము కలిగి యుండక పోయినచో దాని ఫలితములు భయంకరమైనవి. 7 CChTel 168.3