సంఘమునకు ఉపదేశములు

70/329

బోధకుడు తన బోధ ప్రకారము జీవించుట

మీ సంభాషణలో మీరు సర్వదా జాగరూకలై యుండవలెను. దేవునితో సమాధానపడు నిమిత్తము పాపులను ఆహ్వానించుటకు భూమిపై క్రీస్తుకు ప్రతినిధిగా నుంచుటకు దేవుడు మిమ్ములను పిలిచెనా? ఇది గంభీరమును ఉన్నతమైన పని, వేదికపై ప్రసంగించుట ముగిసినపుడే పని ఆరంభమైనది. కూటము లేనపుడు మీకు బాధ్యతా విముక్తి కలుగలేదు. తలను రక్షించుటయను పనిని మీరు నిర్వహించుచునే యుండవలెను. మానవులందరు ఎరిగి గ్రహించునట్టు మూర్తీభవించిన పత్రికలై మీరు జీవించవలెను. CChTel 162.1

సుఖము నపెక్షించ రాదు. వినోదమును గూర్చి తలంచరాదు. ఆత్మల రక్షణయే సర్వ ప్రాముఖ్యాంశము. కార్యము నిర్వహించుటకుకే దైవ సువార్తికుడు పిలువబడెను. కూటము వెలుపల నతడు సత్కార్యములు చేయుచు తన వృత్తి పరిశుద్ధ సంభాషణతోను జాగరిత ప్రవర్తనతోను అలంకరించుకొనవలెను. CChTel 162.2

ఇతరులకు మీరు చేయు బోధ ప్రకారము మీరు జీవించుచు ముందెన్నడు వహించ కార్యభారమును వహించవలెను. బాధ్యతాభారము క్రీస్తు సేవ చేయు ప్రతి బోధకుడు వహించవలెను. వేదికవద్ద చేసిన పనిని ప్రత్యేక కృషి ద్వారా బలపర్చుడి. హాజరైనవారి మనస్తత్వమును యదార్ధముగా గ్రహించి ప్రస్తుతకాల సత్యమును గూర్చి వారితో యుక్తియుతముగా సంభాషించుచు దైవభీతి కలిగి మీకు పరిచితులైన వారి సందర్భముల కన్వయము కదిర్చి ప్రముఖ సత్యభారములను విశదము చేయుడి. 14 CChTel 162.3