సంఘమునకు ఉపదేశములు

52/329

అధ్యాయము11 - పవిత్ర పర్చబడిన జీవితము

మన యావత్తును నాదియని మన రక్షకుడు అనుచున్నాడు. మన ప్రథమ పవిత్ర యోచలను, వినిర్మల, ప్రగాడ ప్రేమను ఆయన కోరుచున్నాడు. వాస్తవముగా మనము దైవస్వబావమందు పాలివారమగుచో ఆయనను గూర్చిన స్తుతి అను నిత్యము మన హృదయముల యందును పెదవులమీదను ఉండును. మన సమస్తమును ఆయనను అంకితము చేసి సర్వదాకృపయందును సత్యవిషయక పరిజ్ఞానమునుందు పెరుగుదల పొందుటయే మనకు క్షేమకరము. 1 CChTel 136.1

లేఖనములలో సూచింపబడిన సంపూర్ణ పవిత్రత సర్వ శరీరమునకు`అత్మ, జీవము, శరీరము సంబంధించినది. సంపూర్ణ సమర్పణనుగూర్చిన వాస్తవిక ఉద్దేశ్యమిదే. థెస్సలోనికైలోని సంఘము ఈ మహత్తర దీవెనను పొందు నిమిత్తము పౌలు ప్రార్థించెను. “సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ద పరచునుగాక. మీఅత్మ యు జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనమందు నిందారహితము గాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక” CChTel 136.2

మత ప్రపంచములో పరిశుద్ద పరచుటనుగూర్చి ఒక సిద్దాంతము కలదు. అది తప్పుడు సిద్థాంతము. దాని పలుకుబడి అపాయకరము. అనేక సందర్బములలో సంపుర్ణ పరిశుద్దత మాకున్నదని చెప్పుకొనువారు నిజముగా దానిని కలిగియున్నవారు కారు. వారి పరిశుద్దత మటలయందును. చిత్తపూజయందును మాత్రమే యుండును. CChTel 136.3

హేతువును, విచక్షణను వారు దూరముగా పెట్టి యెప్పుడో తామనభవించిన క్షణిక ఉద్రేకములను తమ పరిశుద్దతను ప్రాతిపదికముగా పరిగణించెదరు. దీర్ఘ ప్రసంగము చేయుచు, దానికి నిదర్శనముగా సత్ఫలములు ఫలించకుండ మేము పరిశుద్దులమని పెంకితనముగా ప్రగల్పములు పలుకుచు వారు వక్రబుద్దులై యుందురు. పరిశుద్ద పర్చబడిన వారమని చెప్పుకొను ఈ వ్యక్తులు తమ నటనల వలన తమ అత్మలను మోసగించు కొనుటయేగాక దైవచిత్తానుకూలముగా జీవించుటకు యధార్థముగా నభిలషించు అనేకులను అపమార్గము పట్టించు పలుకుబడి కలిగియుందురు. “దేవుడు నున్ను నడుపుచున్నాడు. దేవుడు నాకు ఉపదేశమిచ్చుచాన్నాడు. నేను పాప రహిత జీవితమును జీవించుచున్నాను” అని పునరాద్ఘాటించుట వినబడును. ఇట్టి వ్యక్తులతో పరిచయమేర్పరచుకొన్నవారికి అర్థము కాని యేదో మర్మము చీకటి, తారసపడును. ఇది ఆదర్శప్రాయుడగు క్రీస్తుకు బొత్తుగా విరోధముగా నున్నది. 2 CChTel 136.4

పరిశుద్దత నిత్యాభివృద్ది కాంచుచుండును. పేతుర పలికిన మాటలలో ఇందలి మెట్లు ఈ రీతిగా వ్యక్తిపర్చబడినవి: “మీరు పూర్ణ జాగ్రత్తగలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహసమును, సహసమునందు భక్తిని భక్తియందు సహొదర ప్రేమను, సహొదర ప్రేమయందు దయసు, అమర్చుకొనడి”. “అందువలన సహొదరులారా, మీ పిలుపును,ఏర్పాటును, నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువరైతే ఎప్పుడును తొట్రిల్లరు. అలాగు మన ప్రభువును రక్షకుడువైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్దిగా అనుగ్రహింపబడును” (వచనములు 10,11). CChTel 137.1

మనమెన్నప్పుడు తొట్రిల్లకుండ మనము నిశ్చయత కలుగజేయు మార్గమిందు గలదు. క్రైస్తవ సద్గుణములను అభివృద్ది పరచుకొనుటయను విధానము సవలంభింప పనిచేయు వారికి దేవుడు తన ఆత్మవరముల నిచ్చుటలో హెచ్చించు విధానము నవలభించి పని చేయునను నిశ్చయుత కలదు. 3 CChTel 137.2

పరిశుద్ద పరచు కార్యము ఒక నిముసములోగాని, గంటలోగాని ఒక దినములలోగాని పూర్తియగునదికాదు. కృపయుందు నిత్యమును పెరగుటయే దాని పని. మరునాటి పోరాటమెంత బలముగానుండునో ఈ దినమున మనము గ్రహింపలేము. సాతానుడు జీవించియే యున్నాడు. అతడు చుకుకుగా పనిచేయువాడు. అతనిని ప్రతిఘటించుటకు సహాయము కొరకు, బలము కొరకు అను దినము మనము దేవునికి పట్టుదలతో జయింపవలెను. శోధనలను జయింపవలెను. మనము విశ్రమించుటకు స్థలములేదు. ఒక స్థానమును జేరి మేము సంపూర్తిగా సాదించితిమిని చెప్పుకొనుటకు వీలులేదు. CChTel 137.3

క్రైస్తవ జీవితము సర్వదా పురోగమించ వలసినదే. యేసు తన ప్రజలకు శోదించి నిర్మలము చేవవాడైనట్లు కూర్చొని యున్నాడు. వారియందాయన స్వరూపము సంపూర్గమూగా ప్రతిబించినప్పుడు వారు సంపూర్ణులనును పరిశుద్దులును అగుదురు. పరలోక వ ుటకు వారు సిద్దపర్చబడెదరు. క్రైస్తవుడొక గంభీర కార్యముచేయవలేను. శరీరాత్మల మాలిన్యమును కడుగుకొని దైవభీతియందు పరిశుద్దతా సంపూర్ణతకు పాటుపడవలసినదిగా మనము హెచ్చరించబడుచున్నాము. జరుగ వలసిన బ్రహ్మాండమైన పని నిక్కడ మనము చూచుచున్నము. క్రైస్తవునికిది నిత్యకృత్యము. ఫలములు ఫలించుటకుగాను ప్రతి తీగె తల్లి తీగె నుండి జీవమును బలమును పొందవలెను. 4 CChTel 138.1

దేవుడు తన కట్టడలలో నొక దానిని మానవుల కాళ్లతో త్రొక్కుచున్నను వారిని క్షమించి దీవించునను నమ్మకము మోసకరమైనది పరిశుద్దాత్మయొక్క సాక్ష్యస్వరమును మాటలాడకుండ చేసి ఆత్మను దేవుని నుండి వివదీయును. మతోద్దేశముల వలని ఉత్సాహములేమై యున్నను, దైవ ధర్మశాస్త్రమును గౌరవించి హృదయముతో యేసు నివసింపజాలడు. తన్ను సన్మానించు వారినే యేసు సన్మానించును. 5 CChTel 138.2

“సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్దపరచునుగాక (1 థెస్స 5:23. )అని వ్రాసినప్పుడు పౌలు సాధనీయముగాని ప్రమాణము చేరుటకు ప్రయత్నించుడని తన సహా విశ్వాసులకు సలహా చేయలేదు. దేవుడియ్యనిచ్చగింపని దీవెనలు వారు పొందగలందులకు ఆయన ప్రార్థింపలేదు. సమాధానమందు క్రీస్తుని సంధించుటకు సిద్దపడువారందరు పవిత్రమైన, పరిశుద్దమైన, ప్రవర్తన కలిగి యుండవలెనని ఆయనకు అవగతమే. (1కోరింథీ. 9. 25:1కోరింథీ. 6:19,20 చడువుడి ) CChTel 138.3

యథార్థమగు క్రైస్త నియమము పర్యవసానముల నాలోచించుటకు ఆగదు. నేనిది చేసిన ప్రజలు నన్నుగూర్చి యేమితలంతురు? అని యది తలపోయదు. అది చేసినచో తత్ఫలితముగా నా లౌకికాభ్యున్నతి యెట్లు ండగలరు? అని తలంచదు. తమ పనులద్వారా ఆయనను మహిమపరచు నిమిత్తము వానేమి చేయవలెనని ఆయన కోరుచున్నాడో తెలిసి కొనుటకు దేవుని అభిలాష చూపెదరు. దేవుని యనుచరులు లోకమందు వెలుగుతో ప్రకాశించు దీపములవలె నుండుటకుగాను వారి హృదయములను, జీవితములను దైవకృపాధీనమందుంచు నిమిత్తము ప్రభువు సువిశాల సన్నాహము గావించెను. 6 CChTel 138.4