సంఘమునకు ఉపదేశములు

35/329

ఆధ్యాయము 8 - గృహనిర్వాహకత్వము పై హితబోధలు

దానశాలము దైవశీలమే. ఆత్మార్పణ చేసిన క్రీస్తు ప్రేమ సిలువపై వెల్లడియైనది. మానవుడు రక్షించబడు నిమిత్తము ఆయన తన సర్వమును ఇచ్చి పిదప తన్నుతాను సమర్పించుచొనెను. రక్షకుని ప్రతి అనుచరునికి క్రీస్తు సిలువ, దానశాలము కలిగియుండుటకు దోహదము చేయును. అక్కడ ఉదాహరించబడిన సూత్రము ఇతోధికముగా ఇచ్చుటయే. ప్రజొపకారమందును సత్క్రియల యందును ఆచరించబడినపుడిదియేక్రైస్తవ జీవిత యధార్థఫలమగును లోకాశౌపరుల సూత్రము ఇతోధికముగా పుచ్చుకొనుటÑ వారు సంతోషము నిట్లు సంపాదించజూతురు. కాని ఇది సంపూర్ణకార్యరూపము ధరించగా దాని ఫలము దు:ఖము, మరణము మాత్రమే. CChTel 108.1

క్రీస్తు సిలువనుండి ప్రకాశించుచున్న సువార్త జ్యోతి స్వార్థాపేక్షను గద్దించుచు దాతృత్వమును, పరోకరామును ప్రోత్సహించుచున్నది. దానము కొరకు విశేషముగా విజ్ఞాపనలు వచ్చుట శోకింపదగు విషయముకాదు. దేవుడు తన ప్రజలకు సంకుచిత కార్యరంగము విడిచి విశాల కార్యరంగమున ప్రవేశించుడని ఆహ్వానించుచున్నాడు. ప్రపంచమును నైతిక అంధకారము ఆవరించుచున్న యీ సమయమందు అపరిమితమగు కృషి ఆవశ్యకము. ప్రపంచ మమకారము, దురాశలోచిక్కుకొను అపాయమందు దేవుని ప్రజలలో ననేకులున్నారు. సువార్త సేవకొరకై తమ ధనమునుపయోగించు అవసరములను ఆయన కృపయే అధికము చేయుచున్నాదని వారు గ్రహింపవలెను. కష్టదశలోనున్న ప్రజలను వారు కనిపెట్టి కరుణించి వలెను. అట్లు చేయకున్నచో మహత్తర ఆరర్శపుషుని ప్రవర్తనను వారు అనుకరింపజారు. CChTel 108.2

“సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు” డని తన శిష్యులనాదేశించుటలో క్రీస్తు తన కృపను విస్తరింపజేయు పనిని వారికి నియమించెను. సువార్త ప్రకటించుటకు కొందరు బయలుదేరి వెళ్లగా భూమిపై తన సేవను పోషించు నిమిత్తము విరాళముల నీయవలసీనదిగా ఇతరుల నాయన ఆహ్వానించుచున్నాడు. మనతోడి మానవులను రక్షించుట యన మన నియమిత కార్యమును నిర్వహించుటలో మానవులు అను కాలువగుండా దైన బహుమానములు ప్రవహించుటకుగాను ఆయన కొందరికి ధనమునిచ్చేను. దేవుడు మానవుని ఘనపరచు మార్గములలోనిది యెకటి. మానవునికవసరమగు పని యిదే. ఏలయనగా అతని హృదయసానుభూతినిది కదల్చి ఉన్నతములగు మానసిక శక్తులను కార్యసాధనకు పురికొల్పును. 1 CChTel 108.3

సరియైనా దాతృత్వము మనుష్యుల మానషిక, నైతిక శక్తులను వశపరచుకొని అక్కర లందున్న వారిని ఆదుకొనుటలోను దైవసేవను వృద్దిపరచుటలోను ఆ శక్తులను సక్రమముగా వినియోగించును. 2 CChTel 109.1

అవసరమందున్న సహాదరునికి సహాయము చేయుటకు లేక దైవసత్యమును వ్యాప్తి చేయు పనికి సహాయము చేయుటకు కలుగు ప్రతి తరుణమును, పరలోక ధనాగారములో దాచుచొనుటకై మీరు ముందుగా పంపగల ఒక ముత్యమయి యున్నది. 3 CChTel 109.2