సంఘమునకు ఉపదేశములు

16/329

సూర్యాస్తమ యారాధన

సబ్బాతును కాపాడువారమని చెప్పుకొనుచున్న వారు దానికిచ్చుచున్న పరిశుద్ధతకన్న ఎక్కువ పరిశుద్ధత దానికి ఇయ్యబడినది. ఆజ్ఞానుసారము ` అక్షర సందర్భముగా నేమి లేక భావ సందర్భముగా నేమి ` సబ్బాతు నాచరింపని వారు ప్రభువుని చాలా అవమానపరచుచున్నారు. సబ్బాతాచరణయందు దిద్దుబాటు జరుగవలెనని ఆయన అభిలషించుచున్నాడు. CChTel 71.2

సూర్యాస్తమయమునకు ముందు కుటుంభీకులెల్లరు దైవ వాక్యమును చదువుటకును, పాటలు పాడి ప్రార్థనచేయుటకును కూడుకొనవలెను. ఇక్కడ దిద్దుబాటు అవసరము. కారణమేమనగా అనేకులు దీనిని చేయుట లేదు. మన పాపములను దేవునితోను, మన పొరపాట్లను ఒకరితో నొకరు ఒప్పుకొనుట ఆవశ్యకము. దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరచిన ఈ దినమును మన కుటుంబీకులెల్లరు గౌరవించుటకు సిద్ధపడు నిమిత్తము ప్రత్యేక సన్నాహములు చేయుటకు మనము పునః ప్రయత్నము చేయవలెను. CChTel 71.3

కుటుంబారాధనలలో పిల్లలను పాల్గోననీయండి. అందరినీ బైబిలు గ్రంథములు తెమ్మని వారిని ఒకటి డు వచనములు చదువనీయుడి. పిమ్మట బాగుగా వచ్చిన ఒక పాటను పాడి ప్రార్థన చేయుడి. దీనికి క్రీస్తు ఒక మాదిరినిచ్చెను. కేవలము వల్లించు నిమిత్తమే ప్రభువు ప్రార్థన అనుగ్రహించబడలేదు. మన ప్రార్థన సామాన్యముగాను యధార్థముగాను క్లుప్తముగాను నుండవలెననుట కది యొక ఉదాహరణము. మీ అక్కరలను గూర్చి ప్రభువుకు సరళముగా విన్నవించుకొని తన కృపాధిక్యము నిమిత్తము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మీ గృహములోనికిని, హృదయములోనికిని యేసును ఇట్లు సుస్వాగతముపొందిన అతిథిగా ఆహ్వానించు చున్నారు. కుటుంబ ప్రార్థనలో అనుకూలముగాని యితర విషయములను గూర్చి దీర్ఘ ప్రార్థనలు చేయుట అవాంఛనీయము. ఒక తరుణముగను గొప్ప ఆశీర్వాదకరముగను నుండుటకు బదులు ఇట్టివి ప్రార్థనా సమయమును ఆయాసకరము చేయును. ఈ కూటమును ఆశాజనకముగను ఆనందదాయకముగను చేయుడి. CChTel 71.4

ప్రొద్దు క్రుంకు సమయమున సబ్బాతు అంతమున స్తుతిగీతములతోను, ప్రార్థనతోను పరిశుద్ధ ఘడియల ముగింపును గుర్తించుచు రాగల వారపు పనిపాటులన్నింటిలోనికి దైవసమ్ముఖము నాహ్వానించుడి. సబ్బాతును ప్రభువుకు పరిశుద్ధముగా ఆచరించుట నిత్య రక్షణయని దీని భావము. దేవుడిట్లు సెలవిచ్చు చున్నాడు. “నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును”. 1 సమూయేలు 2:30. 4 CChTel 72.1