సంఘమునకు ఉపదేశములు

2/329

ఉపోద్ఘాతము

క్రీస్తును సంధించుటకు సిద్ధ పడుట

యేసు తాను సిద్ధముచేయ వెళ్ళిన మనోహర గృహమునకు తమ్మును తోడు కొని పోవు సమయము కొరకు సేవెంతుడే ఎడ్వంటిస్టు లందరు ఆతురతతో ఎదురు చూచుచున్నారు. ఆ పరలోక గృహమందు ఇక పాపముండదు. ఆశాభంగములు , ఆకలి, పేదరికము, వ్వాధి, మరణములు అక్కడ ఉండనే వుండవు. నమ్మకముగానుండు వారికి గల ఆధిక్యతలనుగూర్చి తలంచుచు అపొస్త లుడగు యోహానిట్లు ఆశ్చర్య పడుచున్నాడుహా: “మనము దేవుని పిల్ల లమని పిలువబడుటయందు తండ్రి మనమీద ఎట్టి ప్రేమ చూపేనో చూడుడి ; మనము దేవుని పిల్లలమే. .. .. . ఇప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఎమవుదుమో అది ఇంకను ప్రత్క్ష పర్చబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనపుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము.” 1 యోహాను 3:1,2. CChTel 13.1

శీలమునందు తన ప్రజలు యేసువలె నుండవలెనని దేవుని ఆశయము. తన స్వరూపమందు సృజించబడిన మానవ కుటుంబ సభికులు దేవుని పోలిన సౌశీల్యములను కలిగి యుండవలెనని ఆదినుండియు దేవుడు సంఖల్పించియున్నాడు. ఈ కార్యసాధనకు ఏదేను వనమందలి మన మొదటి తల్లిదండ్రులు క్రీస్తు వద్ద నుండియు దూతల వద్ద నుండియు ముఖాముఖి సంభాషణ ద్వారా ఉపదేశమును పొందవలసి యుండిరి. కాని మానవుడు పాపము చేసినప్పటినుండియు ఈ విధముగా పరలోకవాసులతో మాటలాడుట సాధ్యము కాలేదు. CChTel 13.2

నడుపుదలలేని వానిగా మానవుడుడుండకుండునట్లు తన చిత్తి మును ప్రజలకు ఎరుక పరచుటకు దేవుడు ఇతర మార్గములను ఎన్నుకొనెను. వానిలో ముఖ్యమైనది ప్రవక్తాల మధ్య వర్తిత్వము. స్రవచించు వరముగల స్త్రీ పురుషులు దేవుడు పంపిన వర్తమానములను దైవప్రజలకు అందించిరి. ఇశ్రాయేలీయులకు దేవుడిట్లు వ్యక్తము చేసెను, “మీలో ప్రవక్త యుండున యెడల యేహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనునట్లు కలలో అతనితో మాటలాడుదును.” సంఖ్యాకాండము 12:6 CChTel 13.3

తాము నివసించుచున్న విజ్ఞానము కలిగియుండవలెనని రాగల కాలమునుగూర్చి తెలిసికొని గ్రహించుచు తన ప్రజలు విజ్ఞానము కలిగియుండవలెనని సంకల్పము. “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.” (ఆమోసు 3:7) “వెలుగు సంబంధులైన” దైవ ప్రజలకు లోక ప్రజలనుండి (1 థెస్సలోనికై 5:5) ఈ ప్రవచన వరము వేరు చేయుచున్నది. CChTel 14.1

ప్రవక్త యొక్క పని భావి సంగతులను తెలియజేయుట మాత్రమే కాదు. బైబిలులోని ఆరు గ్రంధములను రచించిన మోషే ప్రవక్త భావిసంఘటనలనుగూర్చి చాల తక్కువ రచించెను. హోషేయ ప్రవక్త మోషే పనిని విస్తృతముగా వివరించుచున్నాడు, “ఒక ప్రవక్త ద్వార యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి రపించెను,ప్రవక్త ద్వారా వారిని కాపాడెను.” హూషేయ 12:13. CChTel 14.2

ప్రవక్త ప్రజల వలనగాని స్వకీయముగాగాని ఏర్పర్చబడినవాడు కాడు. మానవ హృదయమును చూచి గ్రహించగల ఏకైక దేవుడే ప్రవక్తను ఎన్నుకొనును. దేవుని కొరకు మాటలాడు నిమిత్తము ఆయాకాలములయందు స్త్రీ పురుషులు ఎన్నుకొనబడుట దైవ ప్రజా చరిత్రలో ఒక ప్రముక విషయమైయున్నది. CChTel 14.3

దైవ సందేశమునందించుటలో సాధనములైన ప్రవచించు వరముగల స్త్రీ పురుషులు పరిశుద్ధ దర్శనములలో దేవుడు తమకు ఎరుక పరిచిన విషయములను బోధించిరి ; వ్రాసిరి. ప్రసాస్తమైన దైవ గ్రంథమునందు వారి వర్తమానములున్నవి. మానవాత్మల నిమిత్తము క్రీస్తు తోను ఆయన దూతలతోనూ సాతనుడు ఆతని దూతలు చేయుచున్న పోరాటమునుగూర్చి మానవ కుటుంబసభికులు గ్రహించునట్లు ఈ ప్రవక్తలు నడిపించుచున్నారు. లోకాంతిమ దినములలో ఈ పోరాటమునుగూర్చియు తన సేవను సాగించుటకు దేవుడు ఏర్పరచిన సాధనములనుగూర్నియు తమ ప్రభువును సంధించుటకు సిద్ధపడు స్త్రీ పురుషుల శీలములను సంపూర్ణము చేయుటకు దేవుడు ఏర్పరచిన సాధనములనుగూర్చియు గ్రహించుటకు మనము నడిపించబడుచున్నాము. CChTel 14.4

బైబిలు రచయితలలో ఆఖరివారగు అపొస్తలులు అంత్యకాలసంఘటనలగూర్చి సుస్పష్టముగా వివరించిరి. పౌలు “అపాయకరమైన కలముల” నుగూర్చి వ్రాసెను తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు “ఆయన ఆగమనమునుగూర్చిన వాగ్దాన మేమాయెను?” అని అపహసించు అపహాసకులగూర్చి పేతురు హెచ్చరించెను. ఈ సమయమందు సంఘము పోరాటమందుండును, ఏలయనగా సాతానుడు “శేషించిన వారితో యుద్ధము చేయుటకు” వెళ్ళుట యోహాను చూచెను. CChTel 14.5

యేసు రాకడకు ముందు దైవ ప్రజలకు ప్రత్యకమైన వెలుగును, సహాయమును ఇచ్చుట దైవసంకల్పమని బైబిలు రచయితలు గుర్తించిరి. CChTel 15.1

క్రీస్తు ఆగమనము ఆశతో కనిపెట్టుచున్న సంఘము -ఎడ్వంటిస్టు సంఘము -ఏ వరమునందును వెనుకబడి యుండదని పౌలు వ్యక్తీకరించుచున్నాడు. (1 కోరింథి 1:7,8) అది సంఘీభావము , నివేచన ,మంచి న్యాయకత్వము ,ప్రవచన వరము కలిగియుండును. ఎలయనగా అందు అపొస్తలులు ,ప్రవక్తలు ,సువార్తికులు ,కాపరులు ,ఉపదేశకులు నుండెదరు. (ఎఫెసీ 4:11) CChTel 15.2

అంత్యకాలసంఘమైన “శేషించిన సంఘమును ” “దేవుని ఆజ్ఞలు గైకొను” సంఘమని అపోస్తలుడగు యోహాను చెప్పుచు ( ప్రకటన 12:17) వారిని ఆజ్ఞలను కాపాడు సంఘముగా నిర్దేశించుచున్నాడు. ఈ శేషించిన సంఘము “యేసునుగూర్చిన సాక్ష్య” మగు “ప్రవచనసారమును” కలిగియుండును. (ప్రకటన 19:10) CChTel 15.3

కనుక ప్రవచనొక్తసంఘమైన సెవెంతుడే ఎడ్వంటిస్టు సంఘము ఉనికిలోనికి వచ్చినపుడు ఆ సంఘమందు ప్రవచన సారముండుట దైవసంకల్పమని సుస్పష్టమగుచున్నది. అనేక శతాబ్దముల క్రిందట ప్రత్యక అవసరతలు ఏర్పడిన సమయములలో దేవుడు తన ప్రజలతో మాటలాడిన రీతిగా పోరాటము ఉధృతమై కాలము అపాయకరముగ పరిణతి చెందుచున్న ఈ లోకాంత్యదినములలో దేవుడు తన ప్రజలతో మాటలాడుట ఎంత సహేతుకము! CChTel 15.4

ప్రవచనోక్త సంఘమైన సెవెంతుడే ఎడ్వంటిస్టు సంఘము ప్రవచనములో చెప్పబడిని కాలమందు ఒక శతాబ్దము క్రిందట వునికిలోనికి వచ్చినపుడు “పవిత్ర దర్శనములో దేవుడు నాకు ప్రత్యక్షపరెచెను,” అను స్వరము మన మధ్య వినబడెను. CChTel 15.5

ఇవి ప్రగల్భపు మాటలు కావు. దేవునికొరకు మాటలాడు నిమిత్తము పిలువబడిన పదిహేడు సంవత్సరములు ప్రాయముగల యువతి పలికిన పలుకులివి. ఆమె చేసిన డెబ్బది వర్షముల నిస్వార్ధసేవలో మనమధ్య ఆ స్వరము వినబడి మార్గదర్శనము ,సంస్కారము, ఉపదేశము నిచ్చినది. దేవుడు ఏర్పరుచుకొన్న ప్రవక్ర్తియగు ఇ. జి. వైటమ్మగారి నిర్విరామ లేఖినినుండి బయల్వెడలిన వేలకొలది ఫుటల ద్వారా ఈనాడుకూడ ఆ స్వరము మనకు వినబడుచున్నది. CChTel 15.6