సంఘమునకు ఉపదేశములు

124/329

ప్రార్థనయందధిక స్థుతి

“జీవమున్న సమస్తమును ప్రభువును స్థుతించుగాక” మన మెంత కృతజ్ఞత కలిగియుండవలెనను విషయమునుగూర్చి మనలో నెవరైనను తలంచిరా? దినదినము దేవుని కృప నూతనముగా మనకు అనుగ్రహింపబడుచున్నదనియు, నమ్మకమందాయన వెనుదీఉవాడు కాడనియు మనకు జ్ఞాపకమున్నదా? దీనికి బదులు మనము “శ్రేష్ఠమైన ప్రతి ఈవి యు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన నదై జ్యోతిర్మయుడగు తండ్రియొద్ద నుండి వచ్చును” అని తరచుగ మరతుము. CChTel 234.1

దినదినము ఏటేట తమ కనుగ్రహింపబడుచున్న మేళ్లను ఆరోగ్యము కలవారు మరచు చున్నారు. ఆయన అను గ్రహించిన మేళ్లన్నింటి విషయము వారు ఆయనను స్థుతించుట లేదు. కాని వ్యాధి సంప్రాప్తమైనప్పుడు వారు దేవుని జ్ఞాపకము చేసుకొనెదరు. స్వస్థత పొందవలెనను ఆపేక్ష, పట్టుదల కలిగి ప్రార్థించునట్లు జేయును. ఇది మంచిదే. వ్యాధి యుండును,ఆరోగ్యమందును మనకు ఆశ్రయము దేవుడే. కాని యనేకులు తమ్మునుతాము దేవుని కప్పగించు కొనరు. తమకు ప్రాప్తించిన వ్యాధిని గూర్చి విచారించుట వలన వారు బలహీనతను వ్యాధిని అధికము చేసికొనెదరు. విచారించుటమాని సంతోషముగ నున్నచో వారికి స్వస్థత తథ్యము. తామనుభవించిన దీర్ఘారోగ్యమును వారు జ్ఞాపకముంచుకొనవలెను. ఈ ప్రశస్థ వరము తిరిగి వారికనుగ్రహింపబడుచో సృస్టికర్తకు వారు నూత్నముగా అచ్చిపడి యున్నారను సంగతి మరువరాదు. పదిమంది కుష్ఠురోగులు స్వస్థపర్చబడినపుడు ఒకడు మాత్రమే యేసుని మహిమ పరుచుటకు తిరిగి వచ్చెను. దైవ కృపను గుర్తించలేని కృతఘ్నులైన కడమ తొమ్మండుగురివలె మనముండకుందుముగాక! 3 CChTel 234.2

రానున్న కీడులను గూర్చి వ్యాకులపడుట యవివేకమును, క్రైస్తత్వము కానిదైయున్నది. అట్లు చేయుట ద్వారా ఆశీర్వాదములను పొందక ప్రస్తుత తరుణములను వృద్ధి చేసికొనలేకయున్నాము. ఈనాటి విధులను నిర్వర్తించి అందలి సాధక బాధకములను అనుభవించవలెనని మనలను ప్రభువు కోరుచున్నాడు. మాటయందుగాని, క్రియయందుగాని నొప్పి కలిగించకుండునట్లు మనము నేడు జాగ్రత్తగా నుండవలెను. నేడు మనము దేవుని గౌరవపర్చి స్థుతించవలెను. అట్టి సజీవ విశ్వాసముద్వారా శతృవును జయించవలెను. నేడు మనము దేవుని వెదకి ఆన సాన్నిధ్యము లభించు వరకు విశ్రమించమని నిర్ధరించుకొనవలెను. ఇది మనకీయ బడిన అంతిమ దినమో యన్నట్లు నేడు మనము మెళుకువగా నుండి పనిచేయుచు ప్రార్థన చేయవలెను. ఇట్లు చేసినచో మన జీవితము ఎంత యదార్ధవంతముగా నుండును! మన సమస్త క్రియల యందును మాటల యందును, మనము క్రీస్తును ఎంత సన్నిహితముగా అనుసరింతుము! 4 CChTel 234.3