సంఘమునకు ఉపదేశములు

84/329

అవసరమందున్న వారికి సహయము చేయుట ఎట్లు?

పేదలకు సహాయము చేయుటకు ప్రక్రియలను జాగరూకతతోను, ప్రార్థన పూర్వకముగాను యోచించవలెను. మనము జ్ఞానము కొరకు దేవుని వేడవలెను. ఏలయనగా తాను సృజించిన ప్రాణులను కాపాడుటలో దూరదృష్టి లేని మానవ మాతృలకన్న ఆయనకు ఎక్కువ తెలియును. సహాయము నర్థించు ప్రతివానికి అనాలోచితముగాఇచ్చువారు కొందరున్నారు. ఇందు వారు పొరబడుచున్నారు. బీదలకు సహాయము చేయదలచినపుడు వారి కవసరమైనదేదో దానినే ఇచ్చుటకు జాగ్రత్త పడవలెను. సహాయము పొందు కొలది ప్రత్యేక సహాయము తామే పొందజూచువారు కొందరున్నారు. ఆధారపడుటకు తెరవున్నంత కాలము వారు దానిపై ఆధారపడుచునే యుందురు. అట్టి వారి కొరకు సమయము వెచ్చించి శ్రద్ధ జూపుట ద్వారా మనము సోమరితనమును దౌర్జన్యమును, దుర్వ్యయములను, అమితభోగమును ప్రోత్సహించిన వారమగుదుము. CChTel 183.1

బీదలకు సహాయము చేయునపుడు మనమిది ఆలోచించవలెను. “నేను దుర్వ్యయమును ప్రోత్సహించు చున్నావా”? తన బత్తెమును తాను సంపాదించు కొనలేని ఏ మానవునికి ఇతరులపై ఆధారపడు హక్కు లేదు. CChTel 183.2

పేద సాదలను గూర్చి శ్రద్ధ వహించుటకు జ్ఞాన వివేకములుగల స్త్రీ పురుషులగు దైవ ప్రజలను నియోగించవలెను. వీరు సంఘమునకు స్థితిగతులను తెలియపర్చి కర్తవ్యమును గూర్చి సలహా చేయవలెను. 8 CChTel 183.3

మన వర్తమానమును అంగీకరించిన ప్రతి బీద కుటుంబమును పోషించవలెనని సహోదరులను దేవుడు కోరుట లేదు. ఇట్లు చేసినచోమన బోధకులు క్రొత్త ప్రదేశములలో ప్రవేసించ వీలుండదు. కారణమేమనగా ధనమంతయు వ్యయమగును. శ్రద్ధ, పొదుపు లేనందున అనేకులు బీదలగు చున్నారు. ద్రవ్యమును సరియగు విధముగా నుపయోగించుట వారికి తెలియకున్నది. వారికి సహాయము చేసినచో అది వారికి హానికరమగును. కొందరెల్లప్పుడును బీదలుగనే యుందురు. పొదుపులేని కారణముగా ఎన్ని అవకాశములున్నను వారు మేలు పొందరు. సంపాదించ గలిగినదంతయు ` అది కొంచమైనను, ఎక్కువైనను ` వ్యయము చేసెదరు. CChTel 183.4

అట్టివారు సంఘమందు ప్రవేసించి ధనికులగు తమ సహచరుల సహాయము పొం దుట తమ హక్కని భావింతురు. తమ కోరిక వీడేరకున్న పక్షమున సంఘమును గూర్చి ఫిర్యాదు చేయుచు సభ్యులు తమ విశ్వాసము ననుసరించి నడుచుకొనుట లేదని అభాండములు వేతురు. ఈ సందర్భమున బాధ ననుభవించవలసిన వారెవరు? ఈ బీద కుటుంబముల పోషణార్థము దైవ సేవ కుంటుపడి ఆయా స్థలము లందలి ధనాగారములు ఖాళీ కావలెనా? అట్లు సంభవించరాదు. బాధ ననుభవించవలసిన వారు తల్లిదండ్రులే. సబ్బాతు నంగీకరించకపూర్వము కన్న ఇప్పుడు వారికెక్కువలేమి కలిగి యుండదు. 9 CChTel 183.5

దేవుడు ప్రతి సంఘమునందును బీదలనుంచును. సర్వదా వారు మనమధ్య నుండవలసినవారే! వారిని ఆదుకొనవలసిన బాధయతను ప్రభువు ప్రతి సభ్యునిపై మోసియున్నాడు. మనము మన బాధ్యతను ఇతరులపై మోపరాదు. క్రీస్తు మనస్థానమందున్నచో ఎట్లు ప్రేమాదరములను చూపునో అట్లే మనము కూడ మన మధ్యనున్న బీదలకు చూపవలయును. క్రీస్తు విధానముల ననుసరించి పనిచేయుటకు మనము శిక్షణ పొందవలెను. 10 CChTel 184.1